మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రం ‘దేవర’ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న భారీ సినిమా కోసం అభిమానులు మరింత ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. RRR తర్వాత చాలా ఆలస్యంగానే మొదలైన దేవర తరహాలోనే ఈ సినిమా కూడా కొంచెం లేట్ అవుతున్నప్పటికీ ప్రతీ చిన్న అంశం పక్కాగా తీసుకెళ్తున్నారు. మరి ఇలా ప్రస్తుతం లోకేష్ వేటలో సినిమా కొనసాగుతుంది.
ఈ సినిమా సినిమాటోగ్రాఫర్ జోర్దాన్, అమన్ ప్రాంతం విజువల్స్ ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దీనితో ప్రస్తుతం సినిమా కోసం లొకేషన్స్ ఫైనల్ చేసే పనిలో ఉన్నట్టుగా అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ సినిమాని మేకర్స్ పాన్ ఇండియా లెవెల్ కాదు ఇంటర్నేషనల్ సినిమా అని చెప్పిన సంగతి తెలిసిందే. సో అభిమానులు మరింత ఎగ్జైటెడ్ గా ఈ సినిమా విషయంలో ఉన్నారు. ఇక ఈ సినిమాలో రుక్మిణి వసంత్ నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.
