పాటల సమీక్ష : లవర్ – ఆకట్టుకునేలా ఉన్నాయి

పాటల సమీక్ష : లవర్ – ఆకట్టుకునేలా ఉన్నాయి

Published on Jun 25, 2018 6:12 PM IST

రాజ్ తరుణ్ నటించిన చిత్రం ‘లవర్’. ఈ సినిమా యొక్క ఆడియో నిన్నే విడుదలైంది. మరి అంకిత్ తివారి, ఆర్కో, రిషి రిచ్, అజయ్ వాస్, సాయి కార్తీక్, తనిష్క్ బాగ్చి వంటి ఆరుగురు సంగీత దర్శకులు సంగీతం అందించిన ఈ పాటలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

1. పాట : నాలో చిలిపి కల Naalo Chilipi Kala

గాయనీ గాయకులు : యాజిన్ నిజర్
సాహిత్యం : శ్రీమణి
సంగీతం : సాయి కార్తీక్

నాలో చిలిపి కల మొదలైందా.. అంటూ ఆరంభమయ్యే ఈ పాట హీరోయిన్ తో మొదటి చూపులోనే ప్రేమలో పడిన సందర్భంలో హీరో పాడే పాటలా ఉంది. పాటకు సాయి కార్తీక్ సంగీతం అందించిన సంగీతం బాగానే ఉంది. శ్రీమణి సాహిత్యం పర్వాలేదు.. రెగ్యులర్ గానే ఉంది. ఇక యాజిన్ నిజర్ గాత్రం వినసొంపుగానే ఉంది. మొత్తం మీద పాట పర్వాలేదు అనే స్థాయిలో ఉంది.

What an Ammayi2. పాట : వాట్ ఏ అమ్మాయి
గాయనీ గాయకులు : శ్రీమణి 
సాహిత్యం : సోను నిగమ్ 
సంగీతం : ఆర్కో 

వాట్ ఏ అమ్మాయి.. అంటూ సాగే ఈ పాట కూడ రొటీన్ గానే ఉంది. చాలా సినిమాల్లో ఉన్నట్టే హీరోయిన్ ను పొగుడుతూ హీరో క్రేజీగా మారిపోయి పాడుకునే పాటలానే ఉంది. శ్రీమణి సాహిత్యం ఈ పాటలో కూడ కొంత పాత తరహాలోనే ఉంది. ఎక్కడా ఎగ్జైట్ చేసే పద ప్రయోగం జరగలేదు. ఆర్కో అందించిన సంగీతం జస్ట్ ఓకే. పాటకు సోను నిగమ్ గాత్రం కొంత హెల్ప్ అయింది.

3. పాట : అద్భుతంAdbutham
గాయనీ గాయకులు : జుబిన్, రజిని జోస్
సంగీతం : తనిష్క్ బాగ్చి
సాహిత్యం : సిరివెన్నెల

ఈ పాటకు సిరివెన్నెల సీతారామశాస్ర్త్రిగారు అందించిన సాహిత్యం ప్రాణం పోసింది. అచ్చ తెలుగు పదాలన్నీ కలిసి పాట యొక్క లక్ష్యాన్ని నెరవేరుస్తూ, పాట లక్షణాన్ని సునాయాసంగా తెలియజేశాయి. కళ్ళలో దాగి ఉన్న కలలు అద్భుతం, పరిపరి తలచేలా చేసే నీ పరిచయం అద్భుతం వంటి పద ప్రయోగం బాగుంది. తనిష్క్ బాగ్చి అందించిన భిన్నమైన సంగీతం వినసొంపుగా ఉంది. జుబిన్, రజిని జోస్ గాత్రం ఆకట్టుకుంది. ఈ పాట ఆల్బమ్ లోని ఉత్తమమైన పాటల్లో ఒకటిగా నిలుస్తుంది.

Ramuni Banamla4. పాట : రాముని బాణంలా
గాయనీ గాయకులు : జుబిన్, రజిని జోస్
సంగీతం : సాయి చరణ్
సాహిత్యం : శ్రీమణి

హీరోను పరిచయం చేసే సందర్భంలో వచ్చే ఈ పాట కొంత వెరైటీగా ఉంది. శ్రీమణి రాసిన లవర్ తో టాకింగ్ కై ఫోన్ కనిపెట్టి హీరో అయ్యాడు గ్రహంబెల్ వంటి లిరిక్స్ బాగున్నాయి. మంచి బీట్స్ కలిగిన సాయి చరణ్ సంగీతం బాగుంది. జుబిన్, రజిని జోస్ ల గాత్రం ఎనర్జిటిక్ గా సాగుతూ హుషారునిచ్చాయి.

5. పాట : అంతేకదా మరి side
గాయనీ గాయకులు : అంకిత్ తివారి, జొనిత గాంధీ
సంగీతం : అంకిత్ తివారి
సాహిత్యం : సిరివెన్నెల

అన్నావో లేదో నువ్వలా ఆ మాట అంటూ మొదలయ్యే ఈ పాట ఆరంభం నుండే ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. అంకిత్ తివారి, జొనిత గాంధీల వినసొంపైన గాత్రానికి తోడు అంకిత్ తివారి అందించిన ప్లెజెంట్ ట్యూన్స్ పాటను అద్భుతంగా మార్చాయి. సిరివెన్నెలగారు రాసిన సాహిత్యం కూడ అర్థవంతంగా, ఆకట్టుకునేలా ఉంది. అన్ని పాటల్లోకి ఇదే ఉత్తమమైన పాటని చెప్పొచ్చు.

Yevaipuga Naa Chupu6. పాట : ఏవైపుగా నా చూపు సాగాలి
గాయనీ గాయకులు : అంకిత్ తివారి
సంగీతం : అంకిత్ తివారి
సాహిత్యం : శ్రీమణి

ఏవైపుగా నా చూపు సాగాలి , ఏవైపని నీ జాడ వేతాకలి అంటూ సాగే ఈ పాట మనసును తాకేదిగా ఉంది. అంకిత్ తివారి సంగీతం, ఆయన పాటను పాడిన విధానం చాలా గొప్పగా ఉండి నిజంగా బాధను గుర్తుచేశాయి. పాటను మళ్ళీ మళ్ళీ వినాలనేలా చేసింది. శ్రీమణి సాహిత్యం ఈ పాటలో చాలా బాగుంది. ఈ పాట కూడ ఆల్బమ్ లోని మంచి పాటల్లో ఒకటిగా నిలుస్తుంది.

తీర్పు:

ఇప్పటి వరకు వచ్చిన రాజ్ తరుణ్ యొక్క మంచి సినిమాల ఆడియోల్లో ఈ ‘లవర్’ ఆడియో కూడ ఒకటిగా నిలుస్తుంది. ఒక ప్రేమ కథకు ఎలాంటి సంగీతం, పాటలైతే కావాలో అలాంటివే ఈ పాటలు. ఉన్న ఆరు పాటల్లోకి ‘అద్భుతం, అంతేకదా మరి, ఏవైపుగా నా చూపు సాగాలి’ లాంటి పాటలు విన్న వెంటనే ఆకట్టుకొనేలా ఉండగా మిగిలిన ‘నాలో చిలిపి కల, వాట్ ఏ అమ్మాయి, రాముని బాణంలా’ పాటలు పర్వాలేదనిపించాయి. కంపోజర్స్ అందరూ మంచి సంగీతాన్ని అందించారు. మొత్తం మీద ఆకట్టుకునేలా ఉన్న ఈ పాటలు సినిమాను ప్రేక్షకులకు దగ్గరచేయడంలో దోహపడతాయనే చెప్పొచ్చు.

Click here for English Music Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు