తగ్గనంటున్న శర్వా దూకుడు.. ‘నారీ నారీ నడుమ మురారి’ ఫ్లోకు యూఎస్ ఫిదా..!

తగ్గనంటున్న శర్వా దూకుడు.. ‘నారీ నారీ నడుమ మురారి’ ఫ్లోకు యూఎస్ ఫిదా..!

Published on Jan 20, 2026 12:11 AM IST

Nari-Nari-Naduma-Murari

చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ రన్ కొనసాగిస్తోంది. ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమా సూపర్ స్టార్ట్ తీసుకుంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే యూఎస్ బాక్సాఫీస్ వద్ద 600K డాలర్లకు పైగా గ్రాస్ సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేసుకుని వచ్చిన ఈ ఎంటర్‌టైనర్ అక్కడి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

ట్రయాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమాలోని కామెడీ, రిలేషన్‌షిప్ డ్రామా మిక్స్‌ ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కథగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయింది. ఇక ఈ సినిమాకు ప్రేక్షకులు పట్టం కడుతుండటం విశేషం.

ఈ సినిమాలో అందాల భామలు సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించగా రామ్ అబ్బరాజు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఈ సినిమాను ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర ప్రొడ్యూస్ చేశారు.

n

సంబంధిత సమాచారం

తాజా వార్తలు