ఢీ 10 ఫైనల్స్ కు ముఖ్య అతిధిగా రానున్న తారక్ !

ఢీ 10 ఫైనల్స్ కు ముఖ్య అతిధిగా రానున్న తారక్ !

Published on Jun 18, 2018 7:47 PM IST

ఈ టివిలో ప్రసారమయ్యే ఢీ డాన్స్ షో ఎంత ఫేమస్సో మనందరికీ తెల్సిందే. ఢీ తో స్టార్ట్ అయినా ప్రస్థానం ఇప్పుడు ఢీ 10 వరకు కొనసాగుతుంది అంతలా ఆకట్టుకుంటుంది ఈ షో . సౌత్ డాన్స్ షోలో పాపులర్ అయినా ఈ డాన్స్ కాంపిటీషన్ షో కి చాలా మందే అభిమానులు వున్నారు అయితే ఇప్పుడు ఈ ఢీ 10 డాన్స్ పోటీలు చివరి దశకు చేరుకున్నాయి .

ఇక ఈ షో ఫైనల్స్ పోటీలను తిలకించడానికి ముఖ్య అతిధిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఢీ 10 కు వస్తున్నారు . అంతేకాకుండా అయన చేతులమీదుగా ఢీ10 విన్నర్స్ కి టైటిల్ ను అందించనున్నారు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో డాన్స్ అనగానే మనకు గుర్తొచ్చేది ఎన్టీఆర్ . మరి ఆయనే ముఖ్య అతిధిగా కనిపించనున్న ఈ షో ఫైనల్స్ ఎలావుండనుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు