శేఖర్ కమ్ముల సినిమా విడుదల ఖరార్?

శేఖర్ కమ్ముల సినిమా విడుదల ఖరార్?

Published on Dec 17, 2011 3:08 PM IST

ఆధునిక భావాలు కలిగిన యువ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తదుపరి చిత్రం ‘లైఫ్ ఇజ్ బ్యూటిఫుల్ ‘. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఎటువంటి ఆడంబరాలు లేకుండా జరుగుతోంది. ఈ చిత్రం తొలుత సంక్రాంతి కి వస్తుందని భావించినప్పటికీ, ఇప్పుడు వినిపిస్తున్న కథనాల ప్రకారం ఫిబ్రవరి 11 న విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఈ చిత్రం లోని ప్రధాన తారాగణం అంతా కొత్తవారు.వీరిని ఒక టాలెంట్ హంట్ ద్వారా ఎంపిక చేసుకున్నారు. శేఖర్ కమ్ముల కి అటు యువత లోనూ, ఇటు ప్రవాసాంధ్రుల లోనూ మంచి ఆదరణ ఉంది. అతడు తీసిన ఆఖరి చిత్రం ‘లీడర్’. ఈ చిత్రానికి మంచి పేరు రావటమే కాక, రాణా దగ్గుబాటికి తొలి చిత్రం కావటం విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు