ఎన్టీఆర్ సినిమాకి టాప్ టెక్నీషియన్ !
Published on Feb 19, 2018 12:33 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ విజయం తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాకి సైన్ చేసిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితమే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. ఈ సినిమా కోసం తారక్ బరువు తగ్గి సరికొత్త లుక్ ట్రై చేస్తున్నాడు. తాజా సమాచారం మేరకు ఈ సినిమా కోసం టాప్ సినిమాటోగ్రఫర్లలో ఒకరైన పి.ఎస్.వినోద్ పనిచేయనున్నారట.

విబినోద్ గతంలో ‘ఊపిరి, మనం, ధృవ’ వంటి పలు పెద్ద సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్లో ఉన్న ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందివ్వనున్నారు. మార్చి నెలలో రెగ్యులర్ షూట్ కు వెళ్లనున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తోంది.

 
Like us on Facebook