మోడీ అభినందనలతో థ్రిల్ అయిన ప్రభాస్ ఫ్యాన్స్!

మోడీ అభినందనలతో థ్రిల్ అయిన ప్రభాస్ ఫ్యాన్స్!

Published on Jul 27, 2015 11:49 AM IST

Prabhas-meets-PM-Narendra-M

‘బాహుబలి’ మానియా ఒక్క సినీ పరిశ్రమనే కాక రాజకీయ, క్రీడా, వ్యాపార రంగ ప్రముఖులను సైతం అబ్బురపరచి సంచలనాలు సృష్టిస్తోన్న విషయం తెలిసిందే! దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా రెండు వారాల క్రితం విడుదలై తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళింది. ఇక ఈ నేపథ్యంలోనే ‘బాహుబలి’ సినిమా కథానాయకుడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, తన పెదనాన్న కృష్ణంరాజుతో పాటు భారత ప్రధాని నరేంద్ర మోడీని కలిసి తమ సినిమాను వీక్షించవలసిందిగా కోరారు.

కాగా తాను బిజీగా ఉన్న కారణంగా ‘బాహుబలి’ సినిమాను ఇంకా చూడలేకపోయానని, త్వరలోనే సమయం కుదుర్చుకొని చూస్తానని ప్రభాస్‌తో నరేంద్ర మోడీ తెలిపారు. ఇక ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన సినిమా చేసినందుకు గాను మోడీ, ప్రభాస్‌ను ఈ సందర్భంగా అభినందించారని సమాచారం. ఇదే సందర్భంగా ‘చూడడానికి ప్రభాస్ నిజంగా బాహుబలి లానే ఉన్నాడు’ అంటూ ప్రధాని మోడీ ప్రభాస్‌ను అభినందించడం విశేషం. ప్రభాస్‌కు మోడీ అందించిన అభినందన పట్ల అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని చాటుకుంటూ పోస్ట్స్ పెడుతున్నారు.

ఇదిలా ఉంటే.. నిన్న హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అద్వానిలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులను కలిసి ప్రభాస్ బాహుబలి సినిమా వీక్షించమని కోరిన విషయం తెలిసిందే! నిన్న సాయంత్రం బీజేపీ ప్రముఖ నేతలకు ఢిల్లీలో ఓ స్పెషల్ షో కూడా వేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు