రాజకీయం ఒక రొచ్చు.. రజినీ నువ్వు రైట్ – మోహన్ బాబు

రాజకీయం ఒక రొచ్చు.. రజినీ నువ్వు రైట్ – మోహన్ బాబు

Published on Dec 31, 2020 11:39 PM IST

mohan
సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడం లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘అన్నాత్తే’ షూటింగ్లో ఉండగా రజినీ అస్వస్థతకు గురికావడం, ఆసుపత్రిలో చేరడం, డిశ్చార్జ్ అయి చెన్నైకు వెళ్ళగానే పార్టీ పెట్టడంలేదని ప్రకటించడం రోజుల వ్యవధిలో జరిగిపోయాయి. రజినీ నిర్ణయం పట్ల అభిమానులు నిరుత్సాహం చెందినా ఆయన సన్నిహితులు మాత్రం సమర్ధిస్తున్నారు. రజినీ ఆప్తమిత్రుడు మంచు మోహన్ బాబు సైతం రజినీ నిర్ణయాన్ని పూర్తిగా సమర్థించారు.

తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఒక లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో ‘రజినీకాంత్ నాకు అత్యంత ఆత్మీయుడు అన్న సంగతి మీకందరికీ తెలుసు. తన ఆరోగ్య రీత్యా పాలిటిక్స్‌లోకి రావట్లేదు అని ప్రకటించాడు. ఒకరకంగా తను రాజకీయాల్లోకి రాకపోవడం మీకు, అభిమానులందరికీ బాధే అయినప్పటికీ, ఒక స్నేహితుడిగా తన ఆరోగ్యం గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తిగా తాను రాజకీయాల్లోకి రాకపోవడం మంచిది అని నమ్ముతున్నాను. నా మిత్రుడితో ఎన్నో సందర్భాల్లో చెప్పాను.. నువ్వు చాలా మంచివాడివి, చీమకు కూడా హాని చేయనివాడివి, నా దృష్టిలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పర్సన్.. నీలాంటి వ్యక్తికి, నాలాంటి వ్యక్తికీ రాజకీయాలు పనికిరావు. ఎందుకంటే మనం ఉన్నది ఉన్నట్లు నిక్కచ్చిగా మాట్లాడతాం. ఎవరికి ద్రోహం చెయ్యం. డబ్బులిచ్చి ఓట్లు, సీట్లు కొనలేము… కొనము కూడా. ఇక్కడ ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియదు. రాజకీయాల్లోకి రానంత వరకు మంచివాడివి అన్న నోళ్లే.. రేపు వచ్చాక చెడ్డవాడిని అంటాయి. రాజకీయం ఒక రొచ్చు. ఒక బురద. ఆ బురద అంటుకోకుండా నువ్వు రాకపోవడమే మంచిది అయ్యింది. రజినీకాంత్ అభిమానులందరూ రజినీకాంత్ అంత మంచివాళ్లు. మీరందరూ సహృదయంతో నా మిత్రుడి నిర్ణయాన్ని అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను’ అన్నారు.

rajini 1

సంబంధిత సమాచారం

తాజా వార్తలు