స్టార్ హీరో సినిమాలో విలన్ గా నటిస్తోన్న మోహన్ బాబు ?
Published on Aug 29, 2018 1:14 am IST


కెరీర్ స్టార్టింగ్ లో విలన్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ హీరో మోహన్ బాబు ఆ తరువాత హీరోగా సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. తన సినీ కెరీర్ మొత్తంలో ఎటువంటి పాత్రనైనా అవలీలగా పోషించగల విలక్షణ నటుడు మోహన్ బాబు, ఆ తరువాత పలు చిత్రాలోని పలు పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. ఇక చాలా కాలం తరువాత అయన రౌడీ సినిమాలో కొంత విలనిజాన్ని చూపించి ఓ వర్గం ఆడియెన్స్ ని ఆకట్టుకున్నారు. అయితే ఈ సారి పూర్తిగా ఓ వైవిధ్యమైన విలన్ పాత్రలో నటించడానికి అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి.

సుధా కొంగర దర్శకత్వంలో కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య ఒక సినిమా చేయనున్నాడు. అయితే ఆ సినిమాలో విలన్ పాత్రకి మోహన్ బాబు అయితే బాగుంటారని, ఈ విషయమై ఆయనను సంప్రదించింది చిత్రబృందం, కథ విన్న మోహన్ బాబు బాగుంది, నేను చేస్తాను అంటూ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారట. నిజానికి మోహన్ బాబు గాయత్రీ సినిమా తరువాత సినిమాలను చాలావరకు తగ్గించి రెస్ట్ తీసుకోవాలని అనుకున్నారు.

కానీ మహానటి సినిమాలో ఎస్వీఆర్ పాత్ర కారణంగా మళ్ళీ నటించాలని నిర్ణయించుకున్న ఆయన, ఈ సినిమా కథ నచ్చడం, దాంతో పాటుగా సూర్య తండ్రి శివకుమార్ తో వున్న మంచి అనుబంధం కారణంగా ఈ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇక తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈ సినిమా ఒకేసారి తెరకెక్కునట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి త్వరలో ఒక అధికారిక ప్రకటన కూడా వెలువడనున్నట్లు సమాచారం.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook