మంచు విష్ణు హీరోగా భారీ పౌరాణిక చిత్రం

Published on Feb 22, 2020 7:14 am IST

నిన్న మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఓ భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. మంచు విష్ణు హీరోగా ఓ భారీ పౌరాణిక చిత్రం తెరకెక్కించనున్నట్లు చెప్పుకొచ్చారు. దాదాపు 60 కోట్లకు పైగా బడ్జెట్ తో భక్త కన్నప్ప చిత్రాన్ని నిర్మించనున్నట్లు మోహన్ బాబు వెల్లడించారు. ఇందులోని నటీనటులు సాంకేతిక నిపుణులు వివరాలు త్వరలో ప్రకటిస్తారు.

ఇప్పటికే మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ అహం బ్రహ్మస్మి అనే భారీ పాన్ ఇండియా మూవీని ప్రకటించారు. తాజాగా మంచు విష్ణు పౌరాణిక చిత్రం ప్రకటించి ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం విష్ణు మోసగాళ్లు అనే ఓ క్రైమ్ థ్రిల్లర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా సైబర్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది.

సంబంధిత సమాచారం :