కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు త్రుటిలో భారీ ప్రమాదం నుండి తప్పించుకున్నారు. ఈ రోజు ఆయన తన రేంజ్ రోవర్ కారులో వెళుతుండగా హైదరాబాద్ లోని మాదాపూర్ ఏరియాలో ఆ కారు భారీ యాక్సిడెంట్ కి గురైంది. మాకు అందించిన తాజా సమాచారం ప్రకారం ఈ యాక్సిడెంట్ నుండి మోహన్ బాబు తృటిలో తప్పించుకున్నారు. కానీ కారు మాత్రం బాగా డామేజ్ అయ్యింది.
కారు బాగా డామేజ్ అయితే అయ్యింది మోహన్ బాబు సేఫ్ గా ఉన్నారని మంచు కుటుంబసభ్యులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది అనే విషయం గురించిన పూర్తి వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది.


