సన్నీ లియోన్ కు మోహన్ బాబు అతిధి సత్కారం

sunney_mohan_babu
మోహన్ బాబు… అయన మాట కంచు.. మనసు మంచు. క్రమశిక్షణకు, మంచితనానికి మరో పేరు. అతిధి మర్యాదలు చేయడంలో అయన తర్వాతే ఎవరైనా. తాజాగా మోహన్ బాబు చేసిన అతిధి మర్యాదలు, సత్కారానికి నీలి చిత్రాల సుందరి, హిందీ హీరోయిన్ సన్నీ లియోన్ మురిసిపోయింది.

మనోజ్ నటిస్తున్న తాజా సినిమా ‘కరెంటు తీగ’లో సన్నీ లియోన్ స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాట చిత్రీకరణ నిన్నటితో పూర్తయింది. సన్నీ లియోన్ తిరిగివెళ్ళే సమయంలో మంచు ఫ్యామిలీ ఆమెకు అతిధి మర్యాదలు చేశారు. తెలుగు సంప్రదాయాలను ఆమెకు తెలియజేశారు. సంతోషంతో పులకరించిపోయిన సన్నీ ట్విట్టర్లో మంచు ఫ్యామిలీకి కృతజ్ఞతలు తెలిపింది.

‘మోహన్ బాబు గారికి, మనోజ్ & కుటుంబసభ్యులకు థాంక్స్. చాలా మంచి విషయాలు చెప్పారు. మిస్సింగ్ కరెంటు తీగ టీం. షూటింగ్ మొత్తం చాలా సరదా సరదాగా గడిచిపోయింది.’ అని సన్నీ లియోన్ ట్వీట్ చేసింది.

Exit mobile version