సూర్య క్యారెక్టర్ పై మోహన్ బాబు ఆసక్తికర ట్వీట్

Published on Jun 17, 2019 11:07 am IST

నటుడిగా మంచి పేరుంది. హీరో సూర్య తదుపరి చిత్రంగా తెరకెక్కుతున్న “సోరారై పోట్రు” లో మోహన్ బాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. చెన్నైలో జరిగిన ఈ మూవీ మొదటి షెడ్యూల్ లో ఈ ఇద్దరు నటులు కలిసి నటించారు. కాగా మొదటిసారిషూటింగ్ లో కలిసిన వీరు మంచి మిత్రులైపోయినట్లున్నారు. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకుంటున్నారు.

మొదట హీరో సూర్య “నిబద్దత,క్రమశిక్షణ కలిగిన గొప్ప నటుడు మోహన్ బాబు గారితో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది,500 సినిమాల ఆయన సుదీర్ఘ సినీ ప్రస్థానం స్ఫూర్తి దాయకం, “సోరారై పోట్రు” చిత్రంలో నటిస్తున్నందుకు ధన్యవాదాలు” అని ట్విట్టర్ లో ఆయనతో తన వర్కింగ్ ఎక్సపీరియెన్స్ ని పంచుకున్నారు.

దీనికి సమాధానంగా మోహన్ బాబు” నాపై మీకున్న అభిప్రాయానికి ధన్యవాదాలు, అగ్ర హీరో ఐనా కూడా సెట్స్ లో మీ క్రమశిక్షణ,వినయం మీ ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం. సెకండ్ షెడ్యూలు కోసం ఎదురుచూస్తున్నాను, యంగ్ ఫ్రెండ్” అని కొంచెం ఎమోషనల్ గా స్పందించారు. ఒక్కసినిమా కోసం అది కూడా ఒక్క షెడ్యూల్ లో కలిసి పనిచేసినందుకు వీరిద్దరి మధ్య పెరిగిన స్నేహం చూస్తుంటే ముచ్చటేస్తుంది.

సంబంధిత సమాచారం :

X
More