స్వచ్చ భారత్ లో పాల్గొన్న డా. మోహన్ బాబు

స్వచ్చ భారత్ లో పాల్గొన్న డా. మోహన్ బాబు

Published on Nov 19, 2014 1:30 PM IST

mohan-babu
గాంధీ జయంతి సందర్భంగా భారత్ ప్రధాని నరేంద్ర మోడీ ప్రాంభించిన ‘స్వచ్చ భారత్ అభియాన్’ ప్రోగ్రాం రోజు రోజుకీ ప్రాచుర్యం పెరుగుతోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలువురు స్టార్స్, సెలబ్రిటీస్ ఈ స్వచ్చ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఇప్పటికే పలువురు పాల్గొన్నారు . తాజాగా వీరి జాబితాలోకి డా. ఎం. మోహన్ బాబు కూడా వచ్చి చేరాడు.

ఈ రోజు ఉదయం మోహన్ బాబు స్వచ్చ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయన తన శ్రీ విద్యానికేతన్ కళాశాల స్టూడెంట్స్ తో కలిసి విద్యానికేతన్ చుట్టు ప్రక్కల ఉన్న గ్రామాల్లో ఈ స్వచ్చ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు . ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు . అంతే కాకుండా మోహన్ బాబు సూపర్ స్టార్ రజినీకాంత్, మంచు లక్ష్మీ, మంచు విష్ణు, మంచు మనోజ్, శ్రీ వరప్రసాద్, పుల్లెల గోపీచంద్, సుమలత అంబరీష్, వెంకటపతి రాజు మరియు ఎమ్మెల్యే తీగల కృష్ణ రెడ్డి లకు కూడా ఈ చాలెంజ్ చేసారు. మరి వారు కూడా త్వరలోనే మోహన్ బాబు చాలెంజ్ ని అంగీకరించి ఈ స్వచ్చ భారత్ లో పాల్గొంటారేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు