మలయాళ స్టార్ నటుడు మోహన్ లాల్ ప్రధాన పాత్రలో దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన అవైటెడ్ క్రేజీ థ్రిల్లర్ సీక్వెల్ చిత్రమే ‘దృశ్యం 3’. తెలుగులో డిజాస్టర్ అని తేలిపోయిన ఈ సినిమా మలయాళ వెర్షన్ లో మాత్రం దుమ్ము లేపుతుంది. ఒక్క కేరళ బాక్సాఫీస్ దగ్గరే కాకుండా వరల్డ్ వైడ్ గా మలయాళ సినిమాల్లో రికార్డు మొత్తం వసూళ్లు ఈ చిత్రానికి ఇపుడు నమోదు అవుతున్నాయి.
ఆల్రెడీ ఒక్క కేరళ రాష్ట్రం నుంచే 50 కోట్లకి పైగా గ్రాస్ ని కేవలం ఈ 4 రోజుల్లోనే రాబట్టి అదరగొట్టినట్టు తెలుస్తుంది. అలాగే న్యూజిలాండ్ ఇతర కొన్ని చోట్ల మోహన్ లాల్ గత చిత్రం ఎంపురాన్ లైఫ్ టైం వసూళ్ళని దృశ్యం 3 ఇప్పుడు క్రాస్ చేసి ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్ గా కూడా నిలిచినట్టు తెలుస్తుంది.
అంతే కాకుండా ఇండియాలో బుకింగ్స్ కూడా స్ట్రాంగ్ హోల్డ్ లో కొనసాగుతూ ఉండడం సినిమా ర్యాంపేజ్ ఎలా ఉందో చూపిస్తుంది. అయితే ఇదంతా సినిమాకి వచ్చిన మిశ్రమ స్పందనతోనే కావడం గమనార్హం. కంప్లీట్ గా పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే ఇంకెలా ఉండేదో మరి.


