ఆకట్టుకుంటున్న మలయాళ సూపర్ స్టార్ లుక్ !

Published on Dec 24, 2018 10:37 am IST


మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇటీవల ‘ఒడియన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మిక్సడ్ రివ్యూస్ ను తెచ్చుకోవడంతో ఈ చిత్రం బాక్సాఫిస్ వద్ద డీలా పడింది. ఫాంటసీ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం మోహన్ లాల్ కు పరాజయాన్ని అందించింది.

ఇక ప్రస్తుతం ఆయన ‘మరక్కార్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో ప్రియదర్శన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈచిత్రంలోనుండి ఇటీవల విడుదలైన మోహన్ లాల్ ఫస్ట్ లుక్ ఆయన అభిమానులను ఆకట్టుకుంటుంది.

ఆశీర్వాద్ సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ , కళ్యాణి ప్రియదర్శన్ , ప్రణవ్ మోహన్ లాల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది చివర్లో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :