
టాలీవుడ్ లో కమర్షియల్ సినిమాలు చాలా ఎక్కువగా వస్తుంటే, ఎప్పుడో ఒకసారి ప్రయోగాత్మక కథలతో ట్రెండ్ సెట్ చేసే ఒక న్యూ జోనర్ ఫిల్మ్స్ వస్తుంటాయి. రెగ్యులర్ కి భిన్నంగా ఉండే డిఫరెంట్ కథలతో సినిమాలు చేసే డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి. ‘సాహసం’ లాంటి ట్రెజర్ హంట్ సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న చంద్రశేఖర్ యేలేటి తన తదుపరి సినిమా కోసం ఓ ఫ్యామిలీ డ్రామాని సిద్దం చేస్తున్నాడని ఇది వరకే తెలియజేశాం.
ఈ సినిమాకి ఫేమస్ డిస్ట్రిబ్యూటర్ మరియు నిర్మాత అయిన సాయి కొర్రపాటి తన వారాహి చలన చిత్రం బ్యానర్ పై నిర్మించనున్నాడు. తెలియజేశాం. ఇందులో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా అలనాటి హీరోయిన్ గౌతమి హీరోయిన్ గా కనిపించనున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులను చివరి దశకు తీసుకు వచ్చిన ఈ చిత్ర టీం నవంబర్ 28 నుంచి ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నారు. అలాగే ఈ సినిమాకి ‘మహిమ’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ఈ సినిమాని ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

