బిగ్ బాస్ కోసం మోహన్ లాల్ తీసుకుంటున్న పారితోషికం ఎంతో తెలుసా !

బిగ్ బాస్ కోసం మోహన్ లాల్ తీసుకుంటున్న పారితోషికం ఎంతో తెలుసా !

Published on Jun 25, 2018 11:03 PM IST

హిందీ లో మొదలైన బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పుడు క్రమక్రమంగా ప్రాంతీయ భాషలకు విస్తరిస్తుంది. దాంట్లో భాగంగానే తెలుగు, తమిళ భాషలో ప్రవేశపెట్టిన ఈషోను తాజాగా మలయాళ ప్రేక్షకులకు కూడా పరిచయం చేశారు. తెలుగు , తమిళ భాషల్లో ప్రస్తుతం సెకండ్ సీజన్ జరుగుతుండగా నిన్న మలయాళం లో మొదటి సీజన్ స్టార్ట్ అయింది .అక్కడ ఈషో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు ప్రఖ్యాత నటుడు మోహన్ లాల్ ఇందుకుగాను ఆయన 12 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని సమాచారం .

అన్ని భాషాల్లో ఈ షో మంచి రేటింగ్స్ ను సాధిస్తుండటంతో మలయాళం లోకూడా మంచి రేటింగ్స్ ను రాబట్టుకోవడానికి మోహన్ లాల్ కి అడిగినంత ఇస్తున్నారట షో నిర్వాహకులు . ఇక 16 మంది కంటెస్టెంట్స్ పాల్గొంటున్న ఈ షో కోసం ముంబై లో ప్రత్యేకంగా బిగ్ బాస్ హౌస్ నిర్మించారు. 100 రోజుల పాటు జరుగనున్న ఈ షో అక్కడ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు