
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మరో రెండు రోజుల్లో నవంబర్ 1 నుంచి మొదలు కానున్న నాన్నకు షెడ్యూల్ కోసం స్పెయిన్ వెళ్లనున్నాడు. ఎన్.టి.ఆర్ నవంబర్ కల్లా నాన్నకు ప్రేమతో షూట్ ని ఫినిష్ చేసి డిసెంబర్ లో ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని కూడా ఫినిష్ చేయనున్నాడు. ఆ తర్వాత జనవరి నుంచి కొరటాల శివ డైరెక్షన్ లో చేయనున్న ‘జనత గ్యారేజ్(వర్కింగ్ టైటిల్)’ ని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాడు. ఈ సినిమా లాంచ్ అయిన రోజు నుంచీ పలు విషయాల్లో వార్తల్లో నిలుస్తోంది. సినిమా లాంచ్ రోజే ఓ ప్రముఖ నటుడు ఈ సినిమాలో ఓ కీ రోల్ లో కనిపించనున్నాడని తెలిపాడు.
దాంతో గత రెండు రోజులుగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇందులో కనిపిస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై అభిమానులకు క్లారిటీ ఇవ్వడం కోసం మేము ఈ చిత్ర మెయిన్ టీం ని సంప్రదించగా వారు చెప్పిన సమాధానం ఏమిటంటే ఎన్.టి.ఆర్ – కొరటాల శివ సినిమాలో కీలకమైన ఓ పాత్రకి స్టార్ హీరో ఇమేజ్ ఉన్న సీనియర్ యాక్టర్ కావాలట, అందుకోసం ఎవరైతే బాగుంటుందా అని చర్చలు జరిపి మోహన్ లాల్ అయితే బాగుంటుంది అని అనుకొని మోహన్ లాల్ ని అప్రోచ్ అయ్యారట. మోహన లాల్ కూడా కొరటాల చెప్పిన పాయింట్ ని విన్నారట. కానీ మోహన్ లాల్ ఇంకా పర్ఫెక్ట్ గా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని వారు తెలిపారు. త్వరలోనే మోహన్ లాల్ ఈ విషయంపై క్లారిటీ ఇస్తే అప్పుడు అధికారికంగా అనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం.
ఫైనల్ గా మోహన్ లాల్ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు కొరటాల శివ ఎన్.టి.ఆర్ తో జోడీ కట్టబోయే ఇద్దరు హీరోయిన్స్ ని కూడా అన్వేషిస్తున్నాడు.

