సమ్మోహనం సరికొత్తగా ఉంటుంది: మోహన కృష్ణ

sammohanam
సుదీర్ బాబు హీరోగా మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన సమ్మోహనం సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంద. ఇటీవల చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసింది. ఓ వర్గం వారిని సినిమా కు సంబందించిన టీజర్ బాగానే ఆకట్టుకుంది. అయితే ఆ టీజర్ విడుదల తరువాత ఈ సినిమా కథ హాలీవుడ్ కథకు కాపీ అని కామెంట్స్ వినిపించడంతో దర్శకుడు మోహన్ కృష్ణ స్పందించారు.

నాటింగ్ హిల్ అనే ప్రేమ కథ తరహాలో ఉందంటూ కొన్ని మీడియాల్లో కథనాలు రావడంతో సోషల్ మీడియా ద్వారా దర్శకుడు సమాధానం ఇచ్చాడు. నాటింగ్ హిల్ అనేది అనేక చిత్రాలకు ప్రబావమని చెబుతూ సమ్మోహనం సినిమా పూర్తి వైవిధ్యంగా ఉంటుందని చెప్పారు. సినిమా చుసిన తరువాత ఆ విషయం అందరికి అర్థమవుతుందని మోహన్ కృష్ణ ట్వీట్ చేశారు. ప్రస్తుతం అందుకు సంబందించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదితి రావ్ హైదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు.

Exit mobile version