వెయ్యి కోట్లతో రెండు భాగాలుగా రానున్న ‘ది మహాభారత’ !

వెయ్యి కోట్లతో రెండు భాగాలుగా రానున్న ‘ది మహాభారత’ !

Published on Aug 2, 2018 8:43 AM IST

బహుభాషా నటుడు, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌ హీరోగా వీఏ శ్రీకుమార్‌ మీనన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత భారీ చిత్రం ‘రన్‌డామూళమ్‌’. కాగా సినీవర్గాల సమాచారం ప్రకారం మలయాళంలో ‘రన్‌డామూళమ్‌’అని టైటిల్ పెడుతుండగా తెలుగు హిందీ, తమిళ్, ఇంగ్లీష్, కన్నడ భాషల్లో ‘ది మహాభారత’ అనే టైటిల్ ను పెడుతున్నారని తెలుస్తోంది. సుమారు వెయ్యి కోట్ల పెట్టుపడితో ఈ చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందనుంది.

అయితే ‘ది మహాభారత’ చిత్రం వచ్చే సంవత్సరం జూలై మాసంలో మొదలవటానికి ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతుంది. ప్రఖ్యాత రచయిత ఎమ్‌టీ వాసుదేవన్‌ నాయర్‌ రాసిన ‘రన్‌డామూళమ్‌’ నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందించనున్నారు. బీఆర్‌ శెట్టి నిర్మించనున్న ఈ చిత్రంలో అన్ని భాషల్లోని ప్రముఖ నటీనటులు నటిస్తుండటం విశేషం. రెండు పార్ట్ లుగా తెరకెక్కతున్న ఈ చిత్రం మొదటి పార్ట్ ను 2020లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయాలనీ దర్శక నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు