మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో, నందకిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం “వృషభ”. కన్నెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ బన్నీ వాస్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
“వృషభ” కేవలం డబ్బింగ్ సినిమా కాదని, అన్ని భాషల నటీనటులతో పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, మలయాళ భాషల్లో దీనిని రూపొందించారని బన్నీ వాస్ స్పష్టం చేశారు. తాను చూసిన 45 నిమిషాల ఫుటేజ్‌లో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని, ముఖ్యంగా కింగ్ ఎపిసోడ్, యాక్షన్ సన్నివేశాలు, తండ్రీకొడుకుల ఎమోషన్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయని ఆయన పేర్కొన్నారు. హీరో సమర్జిత్, హీరోయిన్ నయన్ సారిక తమ పాత్రల్లో ఒదిగిపోయారని ప్రశంసించారు.
చిత్ర హీరోయిన్ నయన్ సారిక మాట్లాడుతూ.. ఈ సినిమా క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుందని, మోహన్ లాల్‌తో నటించడం గర్వంగా ఉందని తెలిపారు. హీరో సమర్జిత్ లంకేష్ ఇది ఒక బిగ్గెస్ట్ యాక్షన్ ఫిలిం అని, ఎమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను కట్టుపడేస్తుందని చెప్పారు. దర్శకుడు నందకిషోర్ మేకింగ్ స్టైల్, సామ్ సీఎస్ సంగీతం సినిమాకు ప్రధాన బలాలని చిత్ర యూనిట్ పేర్కొంది.


