పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘2కె లవర్స్’ సినిమా

2K Lovers Movie

ఎంబీ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌పై మోహిత్ పెడాడ, శృతి శంకర్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘2కె లవర్స్’ (సోల్ ఆఫ్ లవ్). బిచ్చు నాయక్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేష్ నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు ఆదివారం హైదరాబాద్‌లో జరిగాయి.

ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు వీఎన్ ఆదిత్య క్లాప్ కొట్టగా, సంగీత దర్శకుడు మణిశర్మ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. సీనియర్ నటుడు తనికెళ్ల భరణి చిత్ర యూనిట్‌కు స్క్రిప్ట్ అందజేశారు. తెలంగాణ నేపథ్యంలో సాగే భావోద్వేగభరితమైన ప్రేమకథగా, వినోదానికి ప్రాధాన్యమిస్తూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని దర్శకుడు రాజేష్ నాయుడు, నిర్మాత బిచ్చు నాయక్ తెలిపారు.

ఈ చిత్రానికి రసూల్ భాయ్ కథను అందించగా, మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. పవన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాలో సాయి కుమార్, తనికెళ్ల భరణి, ప్రణీత్ రెడ్డి, సప్తగిరి, రచ్చ రవి, మొట్టా రాజేంద్రన్, ఆమని, శివన్నారాయణ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

Exit mobile version