“మనీ హైస్ట్” సీజన్ 5 పై లేటెస్ట్ అప్డేట్!

Published on Aug 30, 2021 12:40 pm IST


ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న వెబ్ సిరీస్ ఏదైనా ఉంది అంటే అది మనీ హైస్ట్ అని చెప్పాలి. ఈ వెబ్ సిరీస్ ఇప్పటి వరకు కూడా నాలుగు సీజన్ లు వచ్చి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే తాజాగా ఐదవ సీజన్ విడుదల కి సిద్దం అవుతోంది.

ఈ మనీ హైస్ట్ ఐదవ సీజన్ రెండు వాల్యూం లుగా విడుదల కానుంది. ఇప్పటికే మేకర్స్ దీని పై ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ వాల్యూం వన్ మరియు 2 లలో ఐదేసి ఎపిసొడ్ లు ఉండనున్నాయి. సీజన్ 5 మొదటి వాల్యూం సెప్టెంబర్ మూడవ తేదీన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. ఇందులో అయిదు ఎపిసిద్ లు ఉండనున్నాయి. అదే విధంగా డిసెంబర్ 3 వ తేదీన వాల్యూం 2 ను విడుదల చేయనున్నారు. వాల్యూం 2 లో అయిదు ఎపిసోడ్ లు ఉండనున్నాయి. ఈ వెబ్ సిరీస్ ఇండియా లో కూడా విశేష ఆదరణ దక్కించుకుంది. ఇందుకు సంబంధించిన ప్రమోషన్స్ సైతం భారీగా చేసినట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :