హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తమ్ముడు’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఇక ఈ సినిమాను దర్శకుడు శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తుండటంతో ఈ చిత్రం ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పుడు ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.
తమ్ముడు చిత్రంలోని ‘మూడ్ ఆఫ్ తమ్ముడు’ అనే ట్రీట్ ఇవ్వబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ ట్రీట్‌ను మే 12న సాయంత్రం 4.05 గంటలకు రివీల్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమాలో నితిన్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది.
ఈ సినిమాలో సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, శాస్విక హీరోయిన్లుగా నటిస్తున్నారు. లయ ఈ చిత్రంతో రీ-ఎంట్రీ ఇస్తోంది. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండగా జూలై 4న రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
