అంతకంతకూ పెరుగుతున్న “దసరా” మార్కెట్.!

Published on Feb 26, 2023 7:03 am IST

నాచురల్ స్టార్ నాని హీరోగా మరో సహజ నటి కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన లేటెస్ట్ సాలిడ్ ఊర మాస్ ఎంటర్టైనర్ చిత్రం “దసరా”. ఆయితే ఈ సినిమా పై అంచనాలు అంతకంతకు పెరుగుతూ వెళ్తున్న సంగతి తెలిసిందే. దీనితో సినిమాకి బిజినెస్ కూడా మరింత స్థాయిలో పెరుగుతూ వెళ్తున్నట్లు తెలుస్తోంది. మరి ప్రస్తుతం అయితే దసరా ఒక్క తెలుగు రాష్ట్రాల బిజినెస్ మాత్రమే 50 కోట్ల మేర నమోదు అవుతున్నట్టు తెలుస్తోంది.

మరి ఇది నాని కెరీర్ లోనే అత్యధికం కాగా ఈ సినిమాకి డిమాండ్ కూడా గట్టిగానే ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఫైనల్ గా సినిమా అంచనాలు రీచ్ అవుతుందో లేదో అనేది మాత్రం రిలీజ్ నాటికి వేచి చూడాల్సిందే. ఇక ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు అలాగే ఎస్ ఎల్ వి సినిమాస్ వారు నిర్మాణం వహించిన ఈ సినిమా ఈ మార్చ్ 30న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.

సంబంధిత సమాచారం :