చరణ్ మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ పై మరింత ఆసక్తి.!

Published on May 30, 2021 4:00 pm IST

ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ “రౌద్రం రణం రుధిరం”. దర్శకుడు రాజమౌళితో ప్లాన్ చేసిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ కూడా నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు మరో స్థాయిలో ఉన్నాయి. ఇక దీని తర్వాత చరణ్ ఊహించని లైనప్ సెట్ చేసాడు. ఇండియన్ సినిమా దగ్గర తన మార్క్ వేసిన మరో సెన్సేషనల్ దర్శకుడు శంకర్ తో వారి కాంబోలో బెంచ్ మార్క్ సినిమాను ప్లాన్ చేసుకున్నారు.

అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది అన్న దానిపై ఆసక్తి మరింత పెరుగుతూ వస్తుంది. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్ బజ్ ప్రకారం దిల్ రాజు వచ్చే నెలలో యూఎస్ నుంచి వచ్చాక ఇక్కడ పనులు వేగవంతం అవుతాయని తెలుస్తుంది. ఇది వరకే చెన్నైలో ఏర్పాటు చేసిన ఆఫీస్ లో దర్శకుడు శంకర్ తో దిల్ రాజు ఓసారి మాట్లాడి సినిమాను ఎప్పుడు నుంచి పట్టాలు ఎక్కించాలి అన్నది డిసైడ్ చేయనున్నారని టాక్. మరి ఈ సెన్సేషనల్ కాంబో ఏ డేట్ నుంచి మొదలు కానుందో చూడాలి.

సంబంధిత సమాచారం :