ఆర్ ఆర్ ఆర్ మరింత ఆలస్యం కానుందా?

ఆర్ ఆర్ ఆర్ మరింత ఆలస్యం కానుందా?

Published on May 19, 2020 10:36 PM IST

ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పై లాక్ డౌన్ ప్రభావం గట్టిగా పడింది. ఈ మూవీకి స్వదేశీ మరియు విదేశీ నిపుణులు పనిచేస్తుండంతో ప్రస్తుత పరిస్థితిలో యదావిధికగా షూటింగ్ నడిపే పరిస్థితి లేదు. ఇక నిర్మాత దానయ్య సైతం ఆర్ ఆర్ ఆర్ చెప్పిన విధంగా 2021 జనవరికి రాదని హింట్ ఇచ్చారు. ఐతే జనవరి రాకున్నా, సమ్మర్ లో అయినా ఆర్ ఆర్ ఆర్ విడుదల ఉంటుందని అందరు భావిస్తున్నారు. ఐతే అనుకున్నదానికంటే చాలా వెనక్కు ఆర్ ఆర్ ఆర్ విడుదల వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం ఆర్ ఆర్ ఆర్ 2021 దసరా లేదా 2022 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారట. మిగిలిన షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కావడానికి కనీసం ఇంత సమయం పడుతుందని వినికిడి. మరి ఇదే కనుక జరిగితే ఎన్టీఆర్ మరియు చరణ్ ఫ్యాన్స్ మరింత నిరాశకు గురికావడం ఖాయం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు