ఓంరౌత్ డైరెక్షన్ తో “ఆదిపురుష్”పై మరిన్ని అంచనాలు.!

Published on Mar 28, 2021 3:00 pm IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న పలు భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రాల్లో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఓంరౌత్ తో తెరకెక్కిస్తున్న మైథలాజికల్ వండర్ “ఆదిపురుష్” కూడా ఒకటి. రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ రామునిగా కృతి సనన్ సీత పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఎలాగో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఓంరౌత్ డైరెక్షన్ కోసం మన తెలుగు ఆడియెన్స్ అందరికీ పెద్దగా తెలియకపోవచ్చు.

కానీ ఓంరౌత్ ఖచ్చితంగా అందరు పెట్టుకున్న అంచనాలు ఏమాత్రం దిగకుండా ప్లాన్చస్తున్నారు. తాను చేసిన లాస్ట్ అండ్ ఫస్ట్ చిత్రం భారీ పీరియాడిక్ చిత్రం “తనాజి” కి లేటెస్ట్ గా బెస్ట్ డైరెక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కింది. దీనితో అంతకు మించిన మ్యాజిక్ తన డైరెక్షన్ తో ఓంరౌత్ ఖచ్చితంగా “ఆదిపురుష్”కు చేస్తాడని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.దీనితో ఆదిపురుష్ పై అంచనాలు మరింత అయ్యాయి. మరి ఓంరౌత్ ఈ మహాకావ్యాన్ని ఎలా చూపిస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :