చరణ్, శంకర్ ప్రాజెక్ట్ పై మరిన్ని గాసిప్స్.!

Published on Mar 14, 2021 8:45 am IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇప్పుడు రెండు బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వాటిలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న “రౌద్రం రణం రుధిరం” అయితే పాన్ ఇండియన్ లెవెల్లో విడుదల కానుంది. మై ఈ రెండు చిత్రాలు ఇంకా లైన్ లో ఉండగానే మరో సెన్సేషనల్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ ను చరణ్ ఓకే చేసాడు.

ఇండియన్ జేమ్స్ కేమరూన్ శంకర్ తో సినిమాను అనౌన్స్ చేస్తేనే ఒక్కసారిగా భారీ హైప్ సెట్టయ్యింది. ఇక ఎలాగో ఈ కాంబో సెట్టయ్యింది బాగానే ఉంది కానీ హీరోయిన్ విషయంలోనే పెద్ద రచ్చ స్టార్ట్ అయ్యింది. ముందు రష్మికా పేరు నుంచి కొరియన్ నటి బే సుజీ పేరు వరకు వచ్చింది.

ఇప్పుడు మళ్ళీ ఈ అంశాలు పైనే మళ్ళీ కొన్ని గాసిప్స్ వినిపిస్తున్నాయి. చరణ్ కు లీడ్ గా మళ్ళీ రష్మికా పేరుతో పాటుగా మరో స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ పేరు రేస్ లోకి వచ్చింది. అయితే ప్రస్తుతానికి ఇవన్నీ జస్ట్ రూమర్స్ గానే వినిపిస్తున్నాయి. మరి క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :