“పుష్ప”లో రష్మికా రోల్ పై మరిన్ని డీటైల్స్.?

Published on Feb 26, 2021 11:00 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ అండ్ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. వీరి కాంబో నుంచి ఇదే మొట్ట మొదటి పాన్ ఇండియన్ సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి అలాగే ఈ సినిమాలో బన్నీ మరియు రష్మికా రోల్స్ కూడా ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా డిజైన్ చేసినట్టుగా కూడా విన్నాము.

అయితే బన్నీ రోల్ పై కొన్నాళ్ల కితమే మంచి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు రష్మికా రోల్ పై కాస్త క్లారిటీలా కనిపిస్తుంది. ఆమె లేటెస్ట్ ఆన్ లొకేషన్ ఫోటోలు మరియు వీడియోస్ గమనిస్తే అంత డీగ్లామరస్ లుక్ లో అయితే కనిపించడం లేదు. పైగా ఓ మిడిల్ క్లాస్ అమ్మాయిలా కనిపిస్తుంది.

మరి ఇలాంటి రోల్ ఉన్న అమ్మాయి ఎర్ర చందనం దుంగలు స్మగ్లింగ్ చేసే బన్నీ రోల్ కు ఎలా లింకప్ అయ్యి ఉంటుంది అన్నది మరో కీలక పాయింట్. ఇక ఈ భారీ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అవుట్ స్టాండింగ్ పాటలు మరియు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :