మిలియన్ డాలర్ ప్రశ్నగా మారుతున్న ‘జన నాయగన్’ రిలీజ్..?

మిలియన్ డాలర్ ప్రశ్నగా మారుతున్న ‘జన నాయగన్’ రిలీజ్..?

Published on Jun 29, 2026 11:00 PM IST

Jana Nayagan

తమిళనాడు సీఎం దళపతి విజయ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రాకముందు నటించిన ఆఖరి చిత్రం ‘జన నాయగన్’. ఒక గ్రాండ్ ఫేర్‌వెల్ మూవీగా రావాల్సిన ఈ చిత్రం, గత కొన్ని నెలలుగా వరుస వివాదాలు, సెన్సార్ అడ్డంకులతో వాయిదా పడుతూ తీవ్ర కన్ఫ్యూజన్‌లో ఉండిపోయింది.

ఈ సినిమా వివాదం మద్రాస్ హైకోర్టు నుండి సుప్రీంకోర్టు వరకు వెళ్లినప్పటికీ ఇప్పటికీ రిలీజ్ డేట్‌పై క్లారిటీ రాలేదు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక విజయ్ పూర్తిగా పాలనపైనే దృష్టి పెట్టాడు. ఈ వివాదాలపై ఆయన మౌనంగా ఉన్నప్పటికీ, సినిమా మరింత ఆలస్యమైతే డిస్ట్రిబ్యూటర్లకు నష్టపరిహారం ఇచ్చేందుకు ఆయన సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే, ఈ చిత్ర నిర్మాత కె. వెంకట్ నారాయణను విజయ్ ప్రభుత్వం ఢిల్లీలో తమిళనాడు ప్రత్యేక ప్రతినిధిగా నియమించడం విశేషం. మరి విజయ్ స్వయంగా రంగంలోకి దిగి తన లాస్ట్ ఫిల్మ్‌ను థియేటర్లలోకి తెస్తాడా లేదా అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారుతుందని ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.

తాజా వార్తలు