“సలార్” సాగా అప్డేట్ సస్పెన్స్ పై మరింత ఆసక్తి.!

Published on Aug 13, 2022 8:03 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ “సలార్” కూడా ఒకటి. దర్శకుడు నీల్ నుంచి వచ్చిన లాస్ట్ సినిమా కేజీయఫ్ 2 నే ఒక యాక్షన్ విధ్వంసం అంటే సలార్ దానికి పదింతలు ఉంటుంది అని చెప్తున్నాడు. దీనితో ఓ రేంజ్ లో ఎగ్జైట్ అవుతున్న డార్లింగ్ ఫ్యాన్స్ ఇప్పుడు రానున్న కొత్త అప్డేట్ కోసం మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి ఇపుడు రాబోయే ఈ అప్డేట్ ఏంటి అనేది సస్పెన్స్ గా మారింది. సలార్ ది సాగా గా ప్లాన్ చేసిన ఈ సినిమా నుంచి నటుడు పృథ్వీ రాజ్, అలాగే ఎప్పుడు నుంచో రావాల్సి ఉన్న మాస్ గ్లింప్స్ లేదా కొత్త రిలీజ్ డేట్ కి సంబంధించి ఏమన్నా అప్డేట్ వస్తుందేమో అని అంతా ఎదురు చూస్తున్నారు. అయితే వీటిలో రిలీజ్ డేట్ లేదా గ్లింప్స్ గాని వచ్చినట్టు అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషి అయినట్టే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :