రవితేజ ప్లానింగ్ చూస్తే మాస్ ట్రీట్ ఖాయమనిపిస్తోంది

Published on Feb 3, 2021 1:14 am IST

‘క్రాక్’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకుని 2021ని విజయవంతంగా ప్రారంభించారు మాస్ మహారాజ రవితేజ. అదే ఊపును తర్వాతి సినిమా ‘ఖిలాడి’తో కూడ కొనసాగించాలని అనుకుంటున్నారు. ఈ చిత్రాన్ని రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తున్నారు. ‘క్రాక్’ సినిమా భారీ విజయాన్ని సాధించింది అంటే అందుకు కారణం ఆ సినిమాలోని యాక్షన్ కంటెంటే. రవితేజను ఈమధ్యకాలంలో ఆ స్థాయి యాక్షన్ కాపీ పాత్రలో చూడలేదు ప్రేక్షకులు. అందుకే విపరీతంగా లైక్ చేశారు.

‘ఖైలాడి’లో కూడ అలాంటి యాక్షన్ డోస్ ఉండేలా జాగ్రత్తపడుతున్నారు రవితేజ. ఈ సినిమాను 55 రోజుల వ్యవధిలో పూర్తిచేయాలని అనుకున్నారు. ఇందులో సుమారు 40 రోజులకుపైగా యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసమే వాడుతున్నారట. దీన్నిబట్టి సినిమాలో యాక్షన్ కంటెంట్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థంచేసుకోవచ్చు. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాను మే 28న విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్స్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, ఉన్ని ముకుందన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :