“లియో” : రిలీజ్ తర్వాత ట్విస్ట్ మీద ట్విస్టు..

LEO 13

కోలీవుడ్ లో ఇప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ దర్శకుడు లోకేష్ కనగ రాజ్. తన రెండో సినిమా “ఖైదీ” తో నెమ్మదిగా ఓ సాలిడ్ కమర్షియల్ యూనివర్స్ ని స్టార్ట్ చేసిన తాను ఒక్కసారిగా “విక్రమ్” సినిమాతో భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు. దీనితో ఆల్రెడీ మంచి క్రేజ్ ఉన్న విజయ్ జోసెఫ్ తో చేసిన చిత్రం “లియో” కి దానిని డబుల్ చేసుకోగా ఈ సినిమా రిలీజ్ అయ్యి అంతా బానే ఉంది అనుకుంటే..

సినిమాలో చూపించిన ట్విస్ట్ లు కన్నా ఈ రిలీజ్ తర్వాత బయట వినిపిస్తున్న ఒకో ట్విస్ట్ కి అసలు ఆడియెన్స్ కి సోషల్ మీడియా ఫాలోవర్స్ కి ఎలా స్పందించాలో అర్ధం కావట్లేదు. రీసెంట్ గా అయితే “లియో” లో పార్థిబన్ ఫ్లాష్ బ్యాక్ అంతా ఫేక్ అని లియో ఫ్లాష్ బ్యాక్ మరొకటి ఉందని ఓ థియరీ వైరల్ గా మారింది.

అంటే ఇప్పుడు లియో లో చూపించింది నిజం కాదా లోకేష్ ఇలా దెబ్బ కొట్టాడేంటి అని చాలా మంది అనుకుంటున్నారు. ఇదొక్కటే కాకుండా అసలు లియో సినిమా అనేదే లేదు ఇదంతా ఫిక్షనల్ స్టోరీ విక్రమ్ లో కమల్ మనవడికి వచ్చిన కలలో ఇదంతా జరిగింది అని ఓ థియరీ ఇంకా త్రిష పాత్రకి అసలు విజయ్ ఎవరు తన ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది ముందే తెలుసు కానీ తెలియనట్టు నటిస్తుంది.

ఈ విషయం విజయ్ కి తెలియదు అనే మరో ట్విస్ట్ ఇలా రకరకాలు వెర్షన్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనితో అయితే అసలు నిజం ఏంటి అనేది ఎవరికీ అర్ధం కావట్లేదు. మొత్తానికి అయితే లోకేష్ కనగరాజ్ మాత్రం తన ఫాలోవర్స్ ని మూవీ లవర్స్ ని పెద్ద డైలమాలో పడేసాడు అని చెప్పాలి.

Exit mobile version