‘కుమారి 21 ఎఫ్’.. యూత్‌లో గత కొద్దిరోజులుగా క్రేజీగా మారిపోయిన సినిమా. విలక్షణ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారి సుకుమార్ రైటింగ్స్ అన్న బ్యానర్‌పై రూపొందించిన ఈ సినిమా ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి టాప్ హీరోల ప్రమోషన్‌తో ఇప్పటికే విపరీతమైన ఆసక్తి రేకెత్తించగా, ఈమధ్యే విడుదలైన ఆడియో, ట్రైలర్‌లతో ఎక్కడికో వెళ్ళిపోయింది. దీనికితోడు ‘కుమారి 21 ఎఫ్’ టీమ్ చేస్తోన్న ప్రచార కార్యక్రమాలు కూడా సినిమాపై మరింత అంచనాలను రేకెత్తిస్తున్నాయి.
ఇక నిన్న సాయంత్రంతో ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని నవంబర్ 20వ తేదీకి ఫిక్స్ అయింది. సెన్సార్ బృందం ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. నేటితరం యువత ఆలోచనా విధానం, దోరణుల గురించి బోల్డ్‌గా చర్చించిన సినిమా కావడంతో ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఇప్పటికే ఫ్యాన్స్‌కు పిచ్చి కిక్ ఇవ్వగా సినిమాలో విజువల్స్ కట్టిపడేసేవిగా ఉంటాయని టీమ్ చెబుతోంది. సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాజ్ తరుణ్, హీబా పాటిల్ హీరో హీరోయిన్లుగా నటించారు.
