మెగాస్టార్ నుంచి జాతరకు డేట్ ఫిక్స్.!

Published on Jan 21, 2021 9:00 am IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “ఆచార్య”. బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం భారీ హంగులతో రూపుదిద్దుకుంటుంది. మరి ఈ మధ్యనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా “సిద్ధ” గా ఆచార్య సెట్స్ లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. మరి అలా ఇప్పటికి వరకు భారీ అంచనాలనే సెట్ చేసుకున్న ఈ చిత్రం నుంచి టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

మరి ఫైనల్ గా ఆ మెగా జాతరకు సమయం ఆసన్నం అయ్యినట్టే టాక్ ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది. కొన్ని రోజుల కితం మేము చెప్పినట్టుగానే వచ్చే జనవరి 26 నే ఈ బడా చిత్రం టీజర్ ఫిక్స్ అయ్యినట్టుగా తెలుస్తుంది. మరి అలాగే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానుందట. చాన్నాళ్ల నుంచి ఎదురు చూస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ టీజర్ కోసం మెగా ఫ్యాన్స్ బాగా ఉవ్విల్లూరుతున్నారు. మరి ఈ టీజర్ లో కొరటాల ఎలాంటి ఎలిమెంట్స్ సెట్ చేసారో చాలా కాలం తర్వాత చిరుకి మణిశర్మ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారో చూడాలి.

సంబంధిత సమాచారం :

More