అఫీషియల్.. పవన్ మోస్ట్ అవైటెడ్ సినిమా అప్పుడే..!

అఫీషియల్.. పవన్ మోస్ట్ అవైటెడ్ సినిమా అప్పుడే..!

Published on Feb 28, 2021 2:11 PM IST

చాలా కాలం బ్రేక్ అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదలు పెట్టిన చిత్రం “వకీల్ సాబ్”. దాని తర్వాత నుంచి అయితే పవన్ ఎప్పుడూ లేని విధంగా ఒకదాని తర్వాత మరొక సినిమాను అనౌన్స్ చేస్తూ ఇండస్ట్రీ వర్గాలకు షాక్ ఇచ్చారు. అయితే ఇన్ని సినిమాలు ఒప్పుకున్నా మాత్రం మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా ఒకటే నిలిచింది. అదే విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తో ప్లాన్ చేసిన భారీ పీరియాడిక్ చిత్రం.

గత కొన్ని రోజుల నుంచి ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్న ఈ సినిమా నుంచి మేకర్స్ అదిరే అప్డేట్ ను రివీల్ చేశారు. ఈ భారీ చిత్రం ను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని సమయాన్ని లాక్ చేసుకున్నారు. సో పవన్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ అప్పటికి ఫిక్స్ అయ్యిందని చెప్పాలి. అలాగే అజ్ఞ్యాతవాసి తర్వాత సంక్రాంతి రేస్ లో ఈ చిత్రం వస్తుండడం గమనార్హం.. మరి ఈ చిత్రంలో నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ లు కీలక పాత్రల్లో నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే ఎ ఎం రత్నం ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు