“ఆచార్య” మోస్ట్ అవైటెడ్ అప్డేట్ రాబోతోందా.?

Published on Jun 26, 2021 1:00 pm IST

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ “ఆచార్య” అనే భారీ బడ్జెట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరి చరణ్ సరసన కూడా నీలాంబరి అనే రోల్ లో మరో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తుంది. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రంపై ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్న అప్డేట్ పై లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది.

ఇది వరకే వచ్చిన ఫస్ట్ సాంగ్ మంచి హిట్ కాగా రెండో పాట చరణ్ మరియు పూజా లపై డిజైన్ చేసింది. దీని కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్నారు. మరి ఇది త్వరలోనే రానున్నట్టు తెలుస్తుంది. అలాగే దానిపై అధికారిక అప్డేట్ కూడా మేకర్స్ వదలనున్నారట. మరి బహుశా సినిమా షూట్ అయ్యాక ఆ అవైటెడ్ అప్డేట్ ను వదులుతారేమో చూడాలి. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటెర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :