మోస్ట్ అవైటెడ్ “ఉప్పెన” స్ట్రీమింగ్ అప్పటి నుంచే.!

Published on Apr 2, 2021 7:03 am IST

మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన మరో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్.. తనకి మాత్రమే కాకుండా హీరోయిన్ కృతి శెట్టి దర్శకుడు బుచ్చిబాబు సానా కు కూడా మొదటి చిత్రమే అయినటువంటి “ఉప్పెన”తో భారీ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఓ డెబ్యూ హీరోగా ఇండియన్ సినిమాలోనే ఏ హీరోకి లేని రికార్డు వైష్ణవ్ సొంతం అయ్యింది.

మరి అలాగే కోలీవుడ్ స్టార్ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కోసం కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఫైనల్ గా ఆ టైం రానున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు వచ్చే ఏప్రిల్ 14 నుంచి స్ట్రీమింగ్ కు అందుబాటులోకి తీసుకురానున్నారట. మరి ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మైండ్ బ్లోయింగ్ ఆల్బమ్ ఇవ్వగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు. అలాగే ఈ ఇద్దరు యువ హీరో హీరోయిన్లు పలు ఆసక్తికర లైనప్స్ తో బిజీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం :