టాలీవుడ్ నుండి ఎక్కువగా ట్వీట్ చేయబడిన హ్యాష్ ట్యాగ్స్ ఇవే!

Published on Aug 23, 2021 12:05 pm IST


సోషల్ మీడియాలో సౌత్ హీరో లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సౌత్ నాట స్టార్ హీరో లకు దేశ వ్యాప్తంగా క్రేజ్ ఉంది. అయితే సోషల్ మీడియా లో ఈ ఏడాది జనవరి 1 వ తేదీ నుండి జూన్ 30 వ తేదీ వరకు ఇండియా లో ఎక్కువగా ట్వీట్స్ చేయబడిన హ్యాష్ ట్యాగ్ లలో సౌత్ నుండి ఎక్కువగా ఉండటం విశేషం. అందులో టాప్ ప్లేస్ లో వలిమై ఉండగా, సెకండ్ ప్లేస్ లో మాస్టర్ ఉంది. మూడవ హ్యాష్ ట్యాగ్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరికొత్త చిత్రం అయిన సర్కారు వారి పాట ఉండటం విశేషం.

అదే విధంగా నాల్గవ ట్వీట్ గా అజిత్ కుమార్ హ్యాష్ ట్యాగ్ ఉండగా, ఐదవ హ్యాష్ ట్యాగ్ తలపథి65 ఉంది. పదవ స్థానం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం టైటిల్ ట్రెండ్ అయింది. టాలీవుడ్ నుండి సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రాలు ఉండటం తో ఈ ఇద్దరి హీరోల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :