హృదయాన్ని హత్తుకునేలా ‘మాతృ’ మూవీలోని ‘అపరంజి బొమ్మ.. మా అమ్మ’ పాట

హృదయాన్ని హత్తుకునేలా ‘మాతృ’ మూవీలోని ‘అపరంజి బొమ్మ.. మా అమ్మ’ పాట

Published on Feb 21, 2025 8:26 AM IST

మదర్ సెంటిమెంట్‌తో వచ్చిన చిత్రాలన్నీ ఇంత వరకు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. మాతృదేవోభవ నుంచి బిచ్చగాడు వరకు ఎన్నెన్నో కల్ట్ క్లాసిక్‌గా నిలిచాయి. ఇప్పుడు ఇదే మదర్ సెంటిమెంట్‌తో ఓ చిత్రం రాబోతోంది. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్ మీద శ్రీపద్మ సమర్పణలో బి.శివ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘మాతృ’. శ్రీరామ్, నందినీ రాయ్, సుగి విజయ్, రూపాలి భూషణ్ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి జాన్ జక్కీ దర్శకత్వం వహించారు.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తి అయింది. త్వరలోనే విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్దమైంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ పెంచేశారు. మాతృ టైటిల్‌కు తగ్గట్టుగా సాగే ఓ మదర్ సెంటిమెంట్‌తో ఎమోషనల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. అపరంజి బొమ్మ.. మా అమ్మ అంటూ సాగే ఈ పాటను దినేశ్ రుద్ర ఆలపించగా.. బి.శివ ప్రసాద్ సాహిత్యాన్ని అందించారు. శేఖర్ చంద్ర బాణీ హృదయాన్ని హత్తుకునేలా ఉంది. ఈ పాట అందరి హృదయాల్ని కరిగించేలా ఉంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.

ఇక ఈ సినిమా నిర్మాతే ఇంతటి గొప్ప పాటను రాయడం విశేషం. ఈ చిత్రానికి రాహుల్ శ్రీ వాత్సవ్ కెమెరామెన్‌గా, సత్యనారాయణ బల్లా ఎడిటర్‌గా పని చేశారు. త్వరలోనే ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు