చిరంజీవికి ధన్యవాదాలు తెలిపిన ఫిల్మ్ ఫెడరేషన్..!

Published on Jul 16, 2021 12:46 am IST

మెగస్టార్ చిరంజీవి సినీ కార్మికుల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. కరోనా మహమ్మారి నుంచి సినీ కార్మికులను కాపాడేందుకు కరోనా క్రైసిస్ చారిటీ(సీసీసీ)ని ప్రారంభించారు. సినీ కార్మికులకు నిత్యావసర వస్తువుల పంపిణీ, ఉచితంగా వ్యాక్సిన్, ఆక్సిజన్ సిలిండర్ల పంపిణీ ఇలా కష్ట కాలంలో ఎంతోమంది ప్రాణాలను చిరంజీవి కాపాడారు. తాజాగా ఓ సినీ కార్మికుడి కుటుంబానికి చెందిన ఓ తల్లి బిడ్డలను చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ రక్తం అందించి ఆదుకుంది.

దీంతో సినీ కార్మికులకు ఆయన చేస్తున్న సేవలకు గాను మరోసారి ఫిల్మ్ ఫెడరేషన్ ఆయనకు కృతజ్ఞతలు తెలియచేస్తూ లేఖ రాసింది. మీరు మన సినీ కార్మికులకు ఎన్నో విధాలుగా సాయం చేస్తున్నారు. మీరు చేసే ప్రతి సేవ జీవితాంతం గుర్తుండేటట్లు సాయం చేస్తున్నారు. అందులో భాగంగా భాస్కర్ అనే సినీ కార్మికుని భార్య డెలివరీ సమయంలో చావు బ్రతుకులలో ఉండ‌గా తల్లి బిడ్డలకు రెండు ద‌ఫాలుగా బ్లడ్ ఇచ్చి బ్రతికించిన మీకు మా పాదాభివందనాలు’ అని లేఖలో పేర్కొన్నారు. ఎల్లప్పుడూ మీరు, మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలు, అష్టశ్వర్యాలతో కలకాలం ఉండాలని ఆ భగవుతుడిని ప్రార్ధిస్తున్నట్టు తెలిపారు.

సంబంధిత సమాచారం :