క్రీడాకారుల్ని ప్రొమోషన్స్ కి వాడేస్తున్నారుగా

క్రీడాకారుల్ని ప్రొమోషన్స్ కి వాడేస్తున్నారుగా

Published on Sep 7, 2019 8:33 AM IST

క్రీడా ప్రధానంగా తెరకెక్కిన చిత్రాల ప్రచారం కొరకు హీరోలు, నిర్మాతలు, పేరుగాంచిన క్రీడాకారుల సహాయం తీసుకోవడం ట్రెండ్ గా మారింది. ట్రైలర్స్, టీజర్స్ వారి చేతుల మీదుగా విడుదల చేయడమే కాకుండా , ప్రమోషన్ కార్యక్రమాలకి వారిని ఆహ్వానిస్తూ ప్రేక్షకులకు చిత్రం చేరువైయ్యేలా చేస్తున్నారు. క్రీడా ప్రధానంగా తెరకెక్కిన చిత్రాల ప్రచార కార్యక్రమాలలో క్రీడాకారులు పాల్గొనడం అనేది కలిసొచ్చే అంశమే.

క్రికెట్ ప్రధానాంశంగా రూపొంది ఇటీవల విడుదలైన కౌసల్య కృష్ణ మూర్తి చిత్ర ప్రొమోషన్స్ లో భారత ఉమెన్స్ క్రికెట్ టీం కెప్టెన్ మిథాలీ రాజ్ పాల్గొన్నారు. ఆమె హైదరాబాద్ కి చెందినవారు కావడంతో చిత్ర యూనిట్ ఆహ్వానం మన్నించి ఆ చిత్రాన్ని ప్రమోట్ చేయడం జరిగింది. ఇక ఇదే చిత్రం కోసం భారత బాడ్మింటన్ సంచలనం పివి సింధు కూడా చిత్ర ప్రొమోషన్స్ లో పాల్గొని మాటసాయం చేశారు. కాగా నిన్న జరిగిన కిచ్చా సుదీప్ పహిల్వాన్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా అతిధిగా హాజరై సింధు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పహిల్వాన్ చిత్రంలో సుధీప్ బాక్సింగ్ రింగ్ లో దిగే కుస్తీ యోధుడిగా కనిపించనున్నారు.

ఇక రణ్వీర్ సింగ్ నటిస్తున్న కపిల్ దేవ్ బయో పిక్ 83 చిత్ర ప్రొమోషన్స్ కొరకు రణ్వీర్ ఈ ఏడాది లండన్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ లో వివిధ క్రికెట్ క్రీడాకారులను కలిసి సందడి చేయడం జరిగింది. ఈ ఏవిధంగా తమ చిత్రాలకు హైప్ తీసుకురావడం కోసం సినిమావాళ్లు క్రీడాకారులను వాడేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు