టాలీవుడ్ లో ఆగిపోయిన అన్ని సినిమాల షూటింగ్స్.!

టాలీవుడ్ లో ఆగిపోయిన అన్ని సినిమాల షూటింగ్స్.!

Published on Oct 14, 2014 2:02 PM IST

TFI
మన తెలుగు చిత్ర పరిశ్రమలో పలు చోట్ల ప్రతి రోజూ పలు సినిమాల షూటింగ్ జరుగుతూ ఉంటుంది. ఇందులో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరి హీరోల, డైరెక్టర్స్ సినిమాలు ఉంటాయి. కర్చుతో కూడుకున్న ఈ షూటింగ్ ఉన్న పళంగా ఆగిపోతే నిర్మాతలకి మరింత భారం అవుతుంది. ఇలాంటి సందర్భమే ఇప్పుడు ఇండస్ట్రీలో నెలకొంది. నిన్నటి నుంచి ఎక్కడి షూటింగ్స్ అక్కడే ఆగిపోయాయి. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలలో ఎక్కడా షూటింగ్స్ జరగడం లేదు. దానికి కారణం .. వర్కర్స్ యూనియన్ వారు తమ జీత బత్యాలు పెంచాలని కోరడమే..

అసలు విషయంలోకి వెళితే.. మూవీ వర్కర్స్ యూనియన్ వారు తమ జీతాలను పెంచాలని కోరుతూ నిన్న ఉదయం నుంచి షూటింగ్స్ కి వెళ్ళకపోవడంతో అన్ని షూటింగ్స్ ఆగిపోయాయి. ప్రస్తుతం ఈ విషయంపై నిర్మాతల, దర్శకుల మరియు చిత్ర మండలితో వర్కర్స్ యూనియన్ వారు చర్చలు జరుపుతున్నారు. వర్కర్స్ అంతా 32% ఇంక్రిమెంట్ చెయ్యాలని కోరుతున్నారు. కానీ అంత పెంచితే నిర్మాతలకు మరింత భారం పెరుగుతుందని చిత్ర మండలి వారు భావిస్తున్నారు. అందుకే వారు ఒక 17% పెంచడానికి సముఖత చూపుతున్నట్లు సమాచారం.

ఒకవేళ ఈ చర్చలు సఫలం అయితే రేపటి నుంచి మళ్ళీ యధాతధంగా షూటింగ్స్ జరుగుతాయి. లేదంటే ఈ చర్చలు ఒక కొలిక్కి వచ్చే వరకూ షూటింగ్స్ జరిగే అవకాశం లేదు. వర్కర్స్ తో అవసరం లేకుండా సెట్స్ లో షూటింగ్ చేసుకునే వారు మాత్రం సైలెంట్ గా షూటింగ్స్ చేసేసుకుంటున్నారు,

తాజా వార్తలు