సెన్సార్ బోర్డుకి ‘మోగ్లీ’ మేకర్స్ క్షమాపణలు..!

Mowgli

టాలీవుడ్‌లో తెరకెక్కిన లేటెస్ట్ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ రొమాంటిక్ డ్రామా చిత్రం ‘మోగ్లీ’ ఇప్పటికే అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమాను దర్శకుడు సందీప్ రాజ్ డైరెక్ట్ చేయగా రోషన్ కనకాల, సాక్షి మదోల్కర్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో బండి సరోజ్ కుమార్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ ఘనంగా నిర్వహించగా, ఆ ఈవెంట్‌లో నటుడు బండి సరోజ్ చేసిన కామెంట్స్ కొత్త వివాదానికి దారి తీశాయి.

మోగ్లీ చిత్రంలో బండి సరోజ్ రూత్‌లెస్ కాప్ పాత్రలో నటిస్తున్నాడని.. ఆయన పర్ఫార్మెన్స్ ఈ సినిమాకే హైలైట్‌గా ఉండనుందని చిత్ర యూనిట్ చెబుతోంది. కాగా, తన పాత్రను చూసి సెన్సార్ బోర్డు భయపడిందని.. ముఖ్యంగా తన పర్ఫార్మెన్స్ చూసి ఓ సెన్సార్ ఆఫీసర్ భయపడిపోయాడని.. అందుకే ఈ సినిమాకు A సర్టిఫికెట్ జారీ చేశారని బండి సరోజ్ కామెంట్ చేశాడు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా, తాజాగా ఈ వివాదంపై పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సెన్సార్ బోర్డు, సెన్సార్ బోర్డు సభ్యులకు క్షమాపణలు చెబుతూ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. బండి సరోజ్ తమ ఈవెంట్‌లో అనుకోకుండా అలా మాట్లాడారని.. ఆయన ఎవరినీ తక్కువ చేయాలని అలా మాట్లడలేదని.. అయినా తప్పు జరిగిందని.. దీనికి తమ నిర్మాణ సంస్థ తరఫున క్షమాపణలు కోరుతున్నామని.. ఆయన మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకుని, దానికి సంబంధించిన ఫుటేజీని అన్ని మాధ్యమాల నుండి తొలగిస్తామని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

Exit mobile version