20 రోజుల్లోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న ‘మోగ్లీ’.. సర్‌ప్రైజ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

20 రోజుల్లోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న ‘మోగ్లీ’.. సర్‌ప్రైజ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Published on Dec 26, 2025 9:01 PM IST

Mowgli

టాలీవుడ్‌లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘మోగ్లీ’(Mowgli) ఇటీవల బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాను నేషనల్ అవార్డ్ విన్నర్ సందీప్ రాజ్ డైరెక్ట్ చేయగా రోషన్ కనకాల, సాక్షి మదోల్కర్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఇటీవల రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించింది.

అయితే, ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతుంది. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ కానుకగా జనవరి 1, 2026న ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఈ సినిమాలో బండి సరోజ్ కుమార్ విలన్ పాత్రలో నటించగా, వైవా హర్ష, కృష్ణ భగవాన్, మౌనిక రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కాలభైరవ సంగీతం అందించగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ప్రొడ్యూస్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు