డ‌బ్బింగ్ వ‌ర్క్ స్టార్ట్ చేసిన ‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్’

డ‌బ్బింగ్ వ‌ర్క్ స్టార్ట్ చేసిన ‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్’

Published on Jul 4, 2024 2:52 PM IST

మాస్ రాజా రవితేజ న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్’ ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల్లో మంచి బ‌జ్ ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ తెర‌కెక్కిస్తుండ‌టంతో, ఈ సినిమాపై భారీ అంచ‌నాలు క్రియేట్ అయ్యాయి. ఇప్ప‌టికే వీరి కాంబినేష‌న్ లో రెండు బ్లాక్ బస్ట‌ర్ చిత్రాలు రావ‌డంతో, ఈసారి హ్యాట్రిక్ హిట్ ఖాయ‌మ‌ని అభిమానులు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమాకు సంబంధించిన డ‌బ్బింగ్ ప‌నుల‌ను తాజాగా స్టార్ట్ చేశారు. హైద‌రబాద్ లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ఈ డ‌బ్బింగ్ వ‌ర్క్ స్టార్ట్ చేశారు మేక‌ర్స్. ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్షన్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో ర‌వితేజ స‌రికొత్త లుక్ లో ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేసేందుకు రెడీ అయ్యాడు.

ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్ట‌ర్స్, వీడియో గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ ల‌భించింది. ఇక ఈ సినిమాలో భాగ్య‌శ్రీ బొర్సె హీరోయిన్ గా నటిస్తోండ‌గా, జ‌గ‌ప‌తి బాబు విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు మిక్కీ జే మేయ‌ర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్ర రిలీజ్ డేట్ ను త్వ‌ర‌లోనే అనౌన్స్ చేసేందుకు మేక‌ర్స్ సిద్ధ‌మ‌వుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు