మిస్టర్ బాక్సాఫీస్ ఊచకోత షురూ.. డే 1 ‘పెద్ది’ కి రికార్డు ఓపెనింగ్స్!

మిస్టర్ బాక్సాఫీస్ ఊచకోత షురూ.. డే 1 ‘పెద్ది’ కి రికార్డు ఓపెనింగ్స్!

Published on Jun 5, 2026 11:00 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి బాక్సాఫీస్ దగ్గర ఉన్న మరో పేరే మిస్టర్ బాక్సాఫీస్ రామ్ చరణ్. అప్పుడెప్పుడో ఓ ఈవెంట్ లో దర్శకుడు త్రివిక్రమ్ రామ్ చరణ్ ను ఉద్దేశించి తాను వేటాడితే సాలిడ్ గానే ఉంటుందని చెప్పిన మాటని ఇపుడు రామ్ చరణ్ మరోసారి ప్రూవ్ చేసాడని చెప్పొచ్చు. గేమ్ ఛేంజర్ లాంటి డిజప్పాయింట్మెంట్ తర్వాత వచ్చిన ఈ సినిమా సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని దక్కించుకుంది.

మేకర్స్ పెద్ది వరల్డ్ వైడ్ డే 1 వసూళ్లు డిక్లేర్ చేశారు. దీనితో పెద్ది ప్రపంచ వ్యాప్తంగా 135.36 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకున్నట్టు అనౌన్స్ చేశారు. దీనితో పెద్ది సినిమా ఈ ఏడాదిలో టాలీవుడ్ నుంచి ఆల్ టైం రికార్డు ఓపెనర్ గా నిలిచి సెన్సేషన్ ని సెట్ చేసింది. ఇక డే 1 ఇలా ఉంటే రెండో రోజు కూడా సినిమా సాలిడ్ బుకింగ్స్, ఆక్యుపెన్సీలను చూస్తుంది. మొత్తానికి మాత్రం బాక్సాఫీస్ దగ్గర మిస్టర్ బాక్సాఫీస్ ఊచకోత మొదలైంది అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి రెహమాన్ సంగీతం అందించగా వృద్ధి సినిమాస్ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు