మిస్టర్ మజ్ను రిలీజ్ డేట్ ఫిక్స్ ?

మిస్టర్ మజ్ను రిలీజ్ డేట్ ఫిక్స్ ?

Published on Nov 25, 2018 8:32 PM IST

యువ హీరో అక్కినేని అఖిల్ నటిస్తున్న మూడవ చిత్రం మిస్టర్ మజ్ను వచ్చే ఏడాది జనవరి లో రానుందని తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఈ చిత్రం యొక్క విడుదల తేదీని ఫిక్స్ చేశారని సమాచారం. వచ్చే ఏడాది జనవరి 25న ఈచిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం భావిస్తోందట.

‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ చిత్రాన్ని ఎస్విసిసి పతాకం ఫై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు